
ఒమర్ అబ్దుల్లా ఆశ్చర్యం
పేదరిక నిర్మూలనకు కృషి చేశారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు.
శ్రీనగర్: పేదరిక నిర్మూలనకు కృషి చేశారంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రశంసించారు. లక్షలాది మందిని పేదరికం నుంచి గట్టెక్కించిన ఘనత మన్మోహన్ కు దక్కుతుందని ట్విటర్ లో పేర్కొన్నారు. మన్మోహన్ కరెక్టుగానే వ్యవహరించారని, చరిత్ర ఆయన పట్ల మరింత సానుకూల వైఖరితో వ్యవహరిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
భారత్ లో పేదరిక నిర్మూలనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనీ విధంగా స్పందించారు. ఒబామా పర్యటన సందర్భంగా మన్మోహన్ సింగ్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల ఒమర్ అబ్దుల్లా ఆశ్చర్యం వక్తం చేశారు.