న్యూఢిల్లీ: టెలికాం శాఖ ప్రతిపాదిత ఆన్‌లైన్ వెరిఫికేషన్ వ్యవస్థలో ఆధార్ కార్డును చిరునామా ధ్రువపత్రం ఉపయోగించాలన్న అంశంపై కేంద్ర హోం శాఖ పలు ఆందోళనలు వ్యక్తంచేసింది. ఆధార్ కార్డుల్లో ఉన్న సమాచారమంతా నిజమనిగాని, ప్రామాణికమనిగాని నమ్మలేమని పేర్కొంది. విశిష్ట గుర్తింపు కల్పించే అంశంలో ఆధార్ పక్కాగా ఉందని, అరుుతే విశిష్ట గుర్తింపు ఉన్నంత మాత్రాన అది ప్రామాణికమైన గుర్తింపనిగాని, అందులోని ఇతర సమాచారమంతా నిజమనిగాని నమ్మలేమని హోంశాఖ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపారుు.
దేశంలో ఉంటున్న విదేశీయులకు కూడా ఆధార్ ఇవ్వడానికి అవకాశముందని, అలాంటప్పుడు ఆధార్‌ను ప్రామాణికంగా తీసుకుంటే.. పొరుగు దేశాల జాతీయులు తమ ఏజెంట్లను ఇక్కడ చొప్పించడం కోసం భారత గుర్తింపు పత్రాలు పొందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తంచేసింది.