సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. మరో నేత కేకే మహేందర్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్ సింగ్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో ఉన్న సీఎం బుధవారం సాయంత్రం కొండా దంపతులు, కేకే మహేందర్‌లను దిగ్విజయ్ నివాసానికి తీసుకెళ్లారు. దిగ్విజయ్‌కు వారిని పరిచయం చేశారు. అనంతరం వారికి దిగ్విజయ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఆ తర్వాత కొండా సురేఖ విలేకరులతో మాట్లాడుతూ.. తమకు రాజకీయ భిక్ష పెట్టిందని కాంగ్రెస్సేనని, పార్టీ తమకు పుట్టిల్లులాంటిదని అన్నారు. తెలంగాణ ప్రజలు, నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్‌లో చేరానన్నారు. సోనియా నాయకత్వంలో తెలంగాణ రావడాన్ని అందరూ హర్షిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేస్తామన్నారు. త్వరలోనే వరంగల్‌లో సభ నిర్వహిస్తామని, దానికి దిగ్విజయ్‌ను ఆహ్వానించగా, సానుకూలంగా స్పందించారని తెలిపారు.
కాంగ్రెస్ గూటికి కొండా దంపతులు
Published Thu, Sep 5 2013 5:34 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement