
'వారిని ఎప్పటికీ క్షమించను'
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాద సంస్థను ఎప్పటికీ క్షమించనని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే అన్నారు.
టోక్యో: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) తీవ్రవాద సంస్థను ఎప్పటికీ క్షమించనని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే అన్నారు. తమ దగ్గర బందీగా ఉన్న జపాన్ జర్నలిస్ట్ కెన్జీ గోటోను ఐఎస్ ఉగ్రవాదులు చంపేసిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు. కెన్జీ గోటో తలనరికిన వీడియోను ఉగ్రవాదులు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు.
'తీవ్రవాదులు అమానవీయమైన, హేయమైన చర్యలకు పాల్పడడం నాకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటువంటి ఉన్మత చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నరమేధానికి పాల్పడుతున్న ఐఎస్ తీవ్రవాదులను ఎన్నటికీ క్షమించను. ఉగ్రవాదుల కిరాతక చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేస్తాం' అని షింజో అబే వ్యాఖ్యానించారు. కెన్జీ గోటోను సంతాపం తెలపడానికి తనకు మాటలు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.