ఆ కంపెనీ కూడా ఏడాదంతా ఫ్రీ 4జీ డేటా | Idea Cellular Offers 3GB Free Data to Lure Customers to Its 4G Network | Sakshi
Sakshi News home page

ఆ కంపెనీ కూడా ఏడాదంతా ఫ్రీ 4జీ డేటా

Published Thu, Jan 12 2017 11:56 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM

ఆ కంపెనీ కూడా ఏడాదంతా ఫ్రీ 4జీ డేటా

ఆ కంపెనీ కూడా ఏడాదంతా ఫ్రీ 4జీ డేటా

4జీలోకి అప్గ్రేట్ అయ్యే కస్టమర్లకు టెలికాం సంస్థలు పోటాపోటీగా ఉచిత డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తమ 4జీ నెట్వర్క్లోకి అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లకు ఏడాదంతా ఉచిత 4జీ డేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించిన వారం రోజుల్లోనే ఐడియా కూడా అదేతరహాలో 4జీ నెట్వర్క్పై తన ప్లాన్స్ను వెల్లడించింది. ఎంపికచేసిన అపరిమిత కాలింగ్ ప్లాన్స్లో డేటా వాడుక పరిమితిని పెంచుతున్నట్టు తెలిపింది. కొత్త 4జీ హ్యాండ్సెట్లలోకి అప్గ్రేడ్ అయ్యే కస్టమర్లకు అదనంగా 3జీబీ మొబైల్ బ్రాండ్బాండ్ ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. దీంతో ఐడియా కస్టమర్లందరూ తమ ప్లాన్స్పై ఉచిత డేటాను పొందవచ్చని ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త ప్లాన్స్పై 4జీ హ్యాండ్సెట్లు మరిన్ని డేటా ప్రయోజనాలు పొందనున్నారని పేర్కొంది. 
 
కొత్త ఐడియా 4జీ డేటా ఆఫర్ కింద రూ.348తో రీచార్జ్ చేసుకుంటే 1జీబీ డేటాను, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్లను ప్రస్తుత ప్రీపెయిడ్ 4జీ హ్యాండ్ సెట్లు కస్టమర్లు పొందవచ్చు. అదే కొత్త 4జీ హ్యాండ్సెట్ల కస్టమర్లయితే అదనంగా 3జీబీ డేటాను పొందుతారని ఐడియా పేర్కొంది. 28 రోజుల వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 13 రీచార్జ్లలో ఏడాదంతా ఈ ఆఫర్ను వినియోగించుకోవచ్చు. 
 
ఐడియా పోస్టు పెయిడ్ కస్టమర్లయితే రూ.499 రెంటల్ ప్లాన్పై సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ సబ్స్క్రిప్షన్తో 4జీ హ్యాండ్సెట్ కస్టమర్లు అపరిమిత లోకల్, నేషనల్, ఇన్కమింగ్ రోమింగ్ కాల్స్తోపాటు 3జీబీ ఉచిత డేటాను పొందవచ్చు. 4జీ హ్యాండ్సెట్ యూజర్లు కానివారు, అపరిమిత కాలింగ్ ప్రయోజనాలతో పాటు 1జీబీ ఉచిత డేటాను ఐడియా అందిస్తోంది. రూ.999 రెంటల్ ప్లాన్ను యాక్టివేట్ చేసుకునే ఐడియా పోస్టు పెయిడ్ కస్టమర్లు రూ.499 ప్లాన్పై ఉన్న అన్నీ ప్రయోజనాలనూ పొందవచ్చు. అంతేకాక, రోమింగ్పై ఉచిత కాల్స్, 4జీ హ్యాండ్సెట్ కస్టమర్లకు 8జీబీ మొబైల్ బ్రాండ్బాండ్, ఇతర కస్టమర్లకు 5జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. కొత్త, పాత కస్టమర్లందరికీ 2017 డిసెంబర్ 31 వరకు ఈ రెంటల్ ప్లాన్స్పై అదనపు 3జీబీ డేటాను తాము అందించనున్నామని ఐడియా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement