మొదటిసారి పండుగకి ఊరెళ్లని ములాయం!
మొదటిసారి పండుగకి ఊరెళ్లని ములాయం!
Published Mon, Oct 31 2016 1:43 PM | Last Updated on Fri, Aug 17 2018 7:32 PM
సమాజ్వాద్ పార్టీ అధినేత ములాయం సింగ్ ఇంట కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఇప్పుడిప్పుడే సర్దుమణిగేలా కనిపించడం లేదు. దివాళి వేడుకలతో ప్రతేడాది తమ స్వగ్రామం సైఫై గ్రామంలో సంతోషంగా కలిసే నేతాజీ కుటుంబసభ్యులు, ఈ సారి తలోదిక్కుగా వేడుకలు జరుపుకున్నారు. నేతాజీ అయితే ఈ సారి దివాళి వేడుకలకు అసలు తన స్వగ్రామమే వెళ్లలేదు. మొదటిసారి ఆయన ఈ వేడుకలకు మిస్ అయ్యారు. అయితే నేతాజీ ఆరోగ్యం బాగోలేకపోవడంతోనే, ఆయన దివాళి వేడుకలకు హాజరుకాలేకపోయారని పలువురు అంటున్నారు. అదేవిధంగా దివాళి వేడుకలకు సైఫై గ్రామం వెళ్లిన పార్టీ కుటుంబసభ్యులు కూడా గెట్ టూ గెదర్ కాలేదట. ముఖ్యమంత్రి అఖిలేష్, బాబాయ్ శివపాల్ ఇద్దరూ విడివిడిగా, వేరువేరు రోజుల్లో సైఫైకు వెళ్లారు.
శనివారం సైఫై వెళ్లిన అఖిలేష్ యాదవ్, తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్థానిక పార్టీ వర్కర్లతో సమావేశమయ్యారు. అనంతరం పార్టీ నుంచి బహిష్కృతమైన రాజ్యసభ సభ్యుడు, తన అంకుల్ రాంగోపాల్ యాదవ్ ఇంట్లో 30 నిమిషాల పాటు గడిపారు. మరోవైపు అఖిలేష్ సైఫై నుంచి లక్నోకు బయలుదేరిన అనంతరం తన బాబాయి శివపాల్ యాదవ్ ఆ గ్రామానికి చేరుకున్నారు. రోడ్డుమార్గంలో నేరుగా అతని చౌగుర్జీ రెసిడెన్స్కు వెళ్లారు. ఇటావా జిల్లా బకేవార్ క్రాసింగ్ ప్రాంతంలో శివపాల్ మద్దతుదారులు ఆయనకు వెల్కమ్ చెప్పారు. ఇలా విడివిడిగా దివాళి వేడుకలకు తమ స్వగ్రామానికి వెళ్లిన యాదవ్ కుటుంబ సభ్యుల తీరును చూస్తే... వారి మధ్య ఘర్షణలు ఇప్పుడిప్పుడే సర్దుమణిగేలా కనిపించడం లేదని పలువురంటున్నారు.
Advertisement