మన దేశంలో రోజూ ఇంటర్నెట్ వాడేవారు ఎంతమందో తెలుసా.. దాదాపు ఏడున్నర కోట్ల మంది!! సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉంటుందని పేరున్న జపాన్ను కూడా ఈ విషయంలో భారతీయులు దాటేశారు. అయితే.. చైనా, అమెరికా మాత్రం మనకంటే ముందున్నాయి. అంటే, ప్రపంచంలో ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించేవారిలో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారన్నమాట. ఈ విషయాన్ని కామ్స్కోర్ అనే పరిశోధన సంస్థ వెల్లడించింది.
ప్రధానంగా మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి భారతీయుల నెట్ వాడకం గణనీయంగా పెరిగింది.
ముఖ్యంగా ఈమెయిళ్లు, వార్తాకథనాలు, సోషల్ మీడియా లాంటి వాటికోసం ఇంటర్నెట్ను భారతీయులు ఉపయోగిస్తున్నారు. కేవలం కంప్యూటర్లలోనే కాకుండా.. స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు, గేమింగ్ ప్లాట్ఫారాల మీద కూడా ఇంటర్నెట్ను గణనీయంగా ఉపయోగిస్తున్నారు.
ప్రతియేటా 31 శాతం పెరుగుదలతో భారతదేశ ఆన్లైన్ జనాభా ఇప్పటికి 7.4 కోట్లకు చేరుకుంది. మరో 14.5 కోట్ల మందికి కూడా నెట్ అందుబాటులో ఉండటంతో ఆన్లైన్ వ్యాపార వాణిజ్యాలు కూడా ఊపందుకున్నాయి. అదే జపాన్లో మాత్రం కేవలం 1.76 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారట. ఆసియా పసిఫిక్ దేశాల్లో 2013 మార్చి నాటికి 64.4 కోట్ల మంది ఇళ్లలోను, కార్యాలయాల్లోను ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా, అందులో చైనా వాటా అత్యధికంగా 54 శాతం ఉంది. తర్వాతి స్థానంలో 11.5 శాతంతో భారత్ ఉండగా, 11.4 శాతంతో జపాన్ మూడో స్థానానికి వెళ్లింది. ఆగ్నేయాసియా 9.6 శాతం, మిగిలిన ఏపీఏసీ 13.5 శాతం వాటాలతో ఉన్నాయి.
ఇంటర్నెట్ వాడకంలో జపాన్ను దాటేసిన భారత్
Published Thu, Aug 22 2013 5:03 PM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
Advertisement
Advertisement