న్యూఢిల్లీ: భారత్‌లో సెకండ్ హ్యాండ్ మార్కెట్ జోరు పెరుగుతోందని ఆసోచామ్ తాజా అధ్యయనం తెలిపింది. ఆసోచామ్ సెక్రటరీ జనరల్ డి.ఎస్. రావత్ పేర్కొన్న వివరాల ప్రకారం..,
- రూ.80 వేల కోట్లుగా ఉన్న సెకండ్ హ్యాండ్ మార్కెట్ విలువ 2015 కల్లా రూ.1,15,000 కోట్లకు పెరుగుతుంది.
- వడ్డీరేట్లు అధికంగా ఉండడం, నష్టభయం వంటి కారణాల వల్ల సెకండ్ హ్యాండ్ వస్తువులు వినియోగించే సంస్కృతి పెరుగుతోంది.
- వినియోగదారుల ఆశలు పెరిగినంతగా ఆదాయాలు పెరగకపోవడంతో సెకండ్ హ్యాండ్ వస్తువులకు డిమాండ్ జోరుగా ఉంది. ఇది వేగంగా విస్తరించే అవకాశం ఉంది.
- ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు, పారిశ్రామిక యంత్రాలు, పుస్తకాలు తదితర వస్తువులు ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అయితే ఫ్రిజ్‌లు, ఏసీలు, వాషింగ్ మెషీన్ల అమ్మకాలు మాత్రం తగ్గుతున్నాయి.