200మందికి ఐటీ నోటీసులు
న్యూఢిల్లీ: నోట్ల రద్దు తర్వాత భారీ డిపాజిట్లపై కన్నేసిన ఐటీ శాఖ మరో కీలక అడుగు ముందుకేసింది. రూ. ఒక కోటి ,ఆపైన డిపాజిట్ చేసిన ఖాతాదారులకు నోటీసులు జారీ చేసింది. నల్లధనం ఏరివేతలో భాగంగా 200ఖాతాదారులకు ఈ నోటీసులు జారీ చేసింది. డీమానిటైజేషన్ కాలంలో డిపాజిట్లపై కన్నేసిన ఐటీ శాఖ రద్దయినోట్ల డిపాజిట్ల ఖాతాలను పరిశీలిస్తోంది. ఈక్రమంలో 200 ఖాతాల్లో భారీ ఎత్తున పాతనోట్లు డిపాజిట్ అయినట్టుగా గుర్తించింది.
నవంబర్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రూ .500 , రూ 1000 కరెన్సీ నోట్ల చలామణిపై నిషేధం విధించారు. ఈ డీమానిటైజేషన్ కాలంలో పెద్ద మొత్తంలో డిపాజిట్ అయిన పాతనోట్లపై దృష్టిపెట్టిన కేంద్రం ఆపరేషన్ క్లీన్ మనీ పథకంలోభాగంగా ఆయా డిపాజిట్లను పరిశీలిస్తున్నసంగతి తెలిసిందే.