జియోను ర్యాగింగ్ చేస్తున్నాయ్! | Jio is a commitment of Rs 2,50,000 crore, set to tap the consumption wave in India: Mukesh Ambani | Sakshi
Sakshi News home page

జియోను ర్యాగింగ్ చేస్తున్నాయ్!

Published Tue, Oct 18 2016 11:22 AM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM

జియోను ర్యాగింగ్ చేస్తున్నాయ్!

జియోను ర్యాగింగ్ చేస్తున్నాయ్!

ముంబై : టెలికాం మార్కెట్లోకి కొత్తగా సంచలనాలు సృష్టిస్తూ వచ్చిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్పై ఇతర టెలికాం కంపెనీలు ర్యాగింగ్కు పాల్పడుతున్నాయట. ఈ ర్యాగింగ్ ఆగడాలను తాను గమనిస్తున్నానని, వెంటనే ర్యాగింగ్ను నిలిపివేయాలని లేకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ హెచ్చరించారు. సీనియర్ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, బర్కాదత్ ఏర్పాటుచేసిన 'ఆఫ్ ది కఫ్' షోలో ఆయన పాల్గొన్నారు. టెలికాం మార్కెట్లో ఎప్పటినుంచో పాతుకునిపోయి ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కొత్తగా వచ్చిన తమ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు ఇంటర్కనెక్షన్ ఇవ్వకుండా ర్యాగింగ్కు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
 
తమ కొత్త టెలికాం వెంచర్ లక్ష్యం రూ.1,50,000 కోట్లు కాదని, రూ.2,50,000కోట్లకు తాము కట్టుబడి ఉన్నామని అంబానీ చెప్పారు. శక్తివంతమైన ఆలోచనలతో ప్రపంచాన్నే మార్చేస్తామన్నారు. బిజినెస్ల పరంగా ఎవరైతే(ఫైనాన్సియల్ ఎనలిస్టులు) మార్కెట్లో జియోను  తప్పుగా చిత్రీకరించాలనుకుంటున్నారో వారికి తమ క్వార్టర్లీ ఫలితాలతో దిమ్మతిరిగే షాకిస్తామన్నారు. ఫైనాన్సియల్ మార్కెట్లు తప్పుదోవలో నడుస్తున్నాయని, ముఖ్యంగా ఆపిల్, గూగుల్ వంటి టెక్నాలజీలను ఆయన విమర్శించారు. ఫైనాల్సియల్ ఎనలిస్టులందరూ తప్పని తమ క్వార్టర్లీ ఫలితాలతో నిరూపిస్తామన్నారు. ఈ విశ్వాసంతోనే తాను ఈ స్థానంలో కొనసాగుతానన్నారు.
 
జియో బోర్డు సభ్యులందరూ తనకు వెన్నంటే ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. జియో అద్భుత సృష్టికి దోహదం చేసిన తన పిల్లలు, ప్రస్తుతం జియో బోర్డు డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాశ్ లను మరోసారి మెచ్చుకున్నారు. భారత్లో పాకిస్తాన్ యాక్టర్ల నిషేధంపై స్పందించిన అంబానీ, భారతీయులకు మొదట దేశమే ముఖ్యమని చెప్పారు. తర్వాతే కళలు, సంస్కృతి అన్నారు.. పాకిస్తానీ యాక్టర్లను భారత్లో నిషేధించడాన్ని ఆయన మద్దతుపలికారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement