
కృష్ణాజలాల కేసు అక్టోబర్ 15కు వాయిదా: సుప్రీం
న్యూఢిల్లీ: కృష్ణా జలాల వివాదం కేసు విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం అక్టోబర్ 15 కు వాయిదా వేసింది. ట్రిబ్యునల్, పునర్వ్యవస్థీకరణ చట్టాల పరిధులను నిర్ణయిస్తామని సుప్రీం తెలిపింది. కృష్ణా జలాల వివాదంపై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ సి. పంత్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది.
నదీ జలాల కేటాయింపు విషయంలో నాలుగు రాష్ట్రాలను పరిధిలోకి తీసుకోవాలా? లేక ఏపీ, తెలంగాణలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని కేటాయించాలా అనే విషయాన్ని తుది విచారణలో వెల్లడిస్తామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.