పొగరాయుళ్ల నుంచి రూ.1.7 కోట్లు వసూలు
పొగరాయుళ్ల నుంచి రూ.1.7 కోట్లు వసూలు
Published Wed, Feb 15 2017 1:28 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
బెంగళూరు : బహిరంగ ప్రదేశాల్లో పొగతాగుట నిషేధం. బస్సులో పొగ తాగరాదు అంటూ ప్రతి ఆర్టీసీ బస్సులో దర్శనమిస్తూనే ఉంటాయి. అయినా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉంటారు. నిబంధనలు అతిక్రమించి పబ్లిక్ ప్రాంతమైన బస్సు స్టేషన్లలో స్మోకింగ్ చేసిన వారికి జరిమానా విధించేలా కర్ణాటక రవాణా సంస్థ(కేఎస్ఆర్టీసీ) చేపట్టిన యాంటీ-స్మోకింగ్ డ్రైవ్కు అనూహ్య స్పందన వచ్చింది. జరిమానా కింద మొత్తం రూ.1.7 కోట్లను కేఎస్ఆర్టీసీ వసూలు చేసింది. 2013 నుంచి ఇప్పటివరకు 85,143 మంది ప్రయాణికులపై కేఎస్ఆర్టీసీ జరిమానా విధించింది.
2013-14 నుంచి 2014-15కు బస్సులో పొగతాగే వారి సంఖ్య పెరిగినా.. ఈ జరిమానాలతో 2015-16కు స్మోకింగ్ చేసే వారి తగ్గినట్టు కేఎస్ఆర్టీసీ పేర్కొంది. సిగరేట్స్, ఇతర పొగాకు ఉత్పత్తుల యాక్ట్ 2003 కింద బస్సు స్టేషన్లో స్మోకింగ్ చేస్తూ పట్టుబడిన వారికి కేఎస్ఆర్టీసీ రూ.200 జరిమానా విధిస్తోంది. దీంతో ఈ ప్రజారవాణా సంస్థకు ఊహించకుండానే రూ.1.70 కోట్ల ఆర్థిక సాయం అందింది. రాష్ట్రవ్యాప్తంగా 150 కేఎస్ఆర్టీసీ బస్సు స్టేషన్లలో ప్రయాణికులు స్మోకింగ్ చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ డ్రైవ్ కేవలం రెవెన్యూలు ఆర్జించడమే కాకుండా, ప్రజల్లో స్మోకింగ్ వల్ల కలిగే ఆరోగ్యసమస్యలపై అవగాహన తెప్పిస్తున్నామన్నారు.
Advertisement
Advertisement