ఒకే వేదికపై అద్వానీ, నరేంద్ర మోడీ | L K Advani, Narendra Modi shared a public platform | Sakshi
Sakshi News home page

ఒకే వేదికపై అద్వానీ, నరేంద్ర మోడీ

Published Wed, Sep 25 2013 3:35 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ఒకే వేదికపై అద్వానీ, నరేంద్ర మోడీ - Sakshi

ఒకే వేదికపై అద్వానీ, నరేంద్ర మోడీ

 బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇద్దరూ కలసి ఒకే బహిరంగ వేదికపై దర్శనమిచ్చారు. బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించిన తర్వాత వీరిద్దరూ కలసి ఓ వేదికపై కనిపించడమిదే తొలిసారి. భోపాల్లో బుధవారం జరిగిన పార్టీ సమావేశంలో అద్వానీ, మోడీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు. మోడీ అభ్యర్థిత్వంపై అద్వానీ కొంతవరకు రాజీపడ్డా మనస్పూర్తిగా సమర్థించడం లేదన్న విషయం ఈ సందర్భంగా బయటపడింది. వేదికపై మోడీ వినమ్రంగా వంగి చేతులు జోడించి ఆశీస్సులు కోరగా, అద్వానీ ఆయన వైపు చూడకుండానే నమస్కరించారు.

అద్వానీ తన ప్రసంగంలో మోడీతో పాటు చౌహాన్, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ను ప్రశంసించారు. కాగా మోడీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ ఎంపిక చేసిదంటూ అద్వానీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మోడీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన అద్వానీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే. అనంతరం పార్టీ అగ్రనేతలు బుజ్జగించడంతో అద్వానీ మెత్తబడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement