నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలో ఆయనతో పాటు మరో నలుగురు కూడా కమిషనర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్తో ప్రధాన సమాచార కమిషనర్ దీపక్ సంధూ ప్రమాణ స్వీకారం చేయించారు. హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మకమైన నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న మాడభూషి శ్రీధర్కు జాతీయ స్థాయిలో పదవి లభించడం పట్ల రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.