ప్రధాని.. ఆ రూమర్లను ఆపాలి! | Madani asks Modi to stop the 'rumour' of Love Jihad | Sakshi
Sakshi News home page

ప్రధాని.. ఆ రూమర్లను ఆపాలి!

Published Mon, Sep 22 2014 4:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

ప్రధాని.. ఆ రూమర్లను ఆపాలి! - Sakshi

ప్రధాని.. ఆ రూమర్లను ఆపాలి!

న్యూఢిల్లీ: బీజేపీ నేతలు తెరలేపిన 'లవ్ జీహాద్' రూమర్లను ఆపేందుకు ప్రధాని నరేంద్రమోడీ నడుంబిగించాలని జమైత్-ఉల్-ఐ-హింద్ జాతీయ కార్యదర్శి మౌలానా మహ్మద్ మదానీ స్పష్టం చేశారు. కొంతమంది  'లవ్ జీహాద్'పేరుతో  ఓట్లను కొల్లగొట్టేందుకు చేసిన యత్నానికి వెంటనే చెక్ పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అన్నారు. దీనికి ప్రధానిగా నరేంద్ర మోడీ  బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జాతీయ వార్తా సంస్థతో మదానీ మాట్లాడారు.

 

'లవ్ జీహాద్' లో ఎటువంటి వివాదం లేదు. కానీ వాటిని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ రూమర్లను ఇకనైనా దయచేసి ఆపండి' అంటూ మోడీకి విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అదే నిజమైతే ఆ రకమైన చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష విధించాలని మదానీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement