
అయ్యారే.. ఏమి తయ్యారే!
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన స్వర్ణకారుడు తాళాబత్తుల సాయి 0.150 మిల్లీ గ్రాముల బంగారంతో తయారుచేసిన సూక్ష్మ పూలకుండీ అబ్చురపరుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన స్వర్ణకారుడు తాళాబత్తుల సాయి 0.150 మిల్లీ గ్రాముల బంగారంతో తయారుచేసిన సూక్ష్మ పూలకుండీ అబ్చురపరుస్తోంది. మూడు పువ్వుల్లో 36 రేకలు, మూడు ఆకులతో దీన్ని తయారుచేశారు. మూడు గంటల వ్యవధిలో దీనిని తయారుచేసినట్టు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో అనంతపురంలో జరిగే మూడు రాష్ట్రాల సూక్ష్మ కళాఖండాల ప్రదర్శనలో తాను తయారుచేసిన వివిధ సూక్ష్మ కళాఖండాలతోపాటు దీన్ని ప్రదర్శించనున్నట్టు తెలిపారు.
- న్యూస్‌లైన్, పెద్దాపురం