
ఒబామాకు 'టెలిగ్రామ్' కానుక
న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన బహుమతి అందజేశారు. అమెరికా- భారత్ చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన టెలిగ్రామ్ ను కానుకగా ఇచ్చారు. 1946లోఅమెరికా నుంచి భారత రాజ్యాంగ సభకు వచ్చిన మొదటి టెలిగ్రామ్ కాపీని ఒబామాకు మోదీ బహుకరించారు.
హైదరాబాద్ హౌస్ లో అత్యున్నతస్థాయి ప్రతినిధులతో సమావేశానికి ముందు ఒబామాకు దీన్ని అందించారు. రాజ్యాంగ సభకు తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న సచ్చిదానంద సిన్హాకు అమెరికా యాకింగ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ గా వ్యవహరించిన డీన్ అచేసన్ అప్పట్లో ఈ టెలిగ్రాఫ్ పంపారు.