యువత భారీగా తరలిరావాలి | narendra modi urges youth to cast vote in large numbers | Sakshi
Sakshi News home page

యువత భారీగా తరలిరావాలి

Published Mon, Oct 12 2015 7:40 AM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

యువత భారీగా తరలిరావాలి - Sakshi

యువత భారీగా తరలిరావాలి

న్యూఢిల్లీ : బిహార్ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటు వేయాలని ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా తన యువ స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి తొలి విడత ఎన్నికలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. మొత్తం ఐదు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో మొదటి విడతలో 49 స్థానాలకు సోమవారం పోలింగ్ జరుగుతోంది.

కాగా,  బిహార్‌లోని కైమూర్ జిల్లా భభువాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించటానికి ఎన్నికల సంఘం అనుమతించింది. రాష్ట్రంలో సోమవారం తొలి దశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ సభను నిర్వహించటం కుదరదని జిల్లా కలెక్టర్ శనివారం అనుమతి నిరాకరించటం వివాదాస్పదమైంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement