కొత్తగా జీఎస్టీ సర్టిఫికెట్‌ కోర్సు | New GST Certificate course | Sakshi
Sakshi News home page

కొత్తగా జీఎస్టీ సర్టిఫికెట్‌ కోర్సు

Published Tue, Jul 4 2017 1:19 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

కొత్తగా జీఎస్టీ సర్టిఫికెట్‌ కోర్సు

కొత్తగా జీఎస్టీ సర్టిఫికెట్‌ కోర్సు

భోపాల్‌: వస్తుసేవల పన్ను(జీఎస్టీ)పై గ్రాడ్యుయేట్లలో పూర్తి అవగాహన కల్పించడమే లక్ష్యంగా వారి కోసం జీఎస్టీ సర్టిఫికెట్‌ కోర్సును కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రి త్వ శాఖ (ఎంఎస్‌డీఈ) ప్రారంభించనుంది. 100 గంటలు క్లాసులు బోధించే ఈ కొత్త కోర్సును పైలట్‌ ప్రాజెక్టుగా ఈ నెల 15 నుంచి భోపాల్, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో మొదలుపెట్టనున్నారు.

అన్ని విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న విద్యార్థులంతా ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త పన్నుల విధానమైన జీఎస్టీలో పన్ను రేట్లు, జీఎస్టీ కింద రిజిస్ట్రేషన్లు, ఏఏ పద్ధతుల్లో పన్నులను ఎలా గణిస్తారో.. తదితరాలను కోర్సులో బోధిస్తారు. పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లకు ప్రిన్సిపాల్స్‌గా పనిచేస్తూ శిక్షణాభివృద్ధి కోసం విశేష కృషిచేస్తున్న వారి పేర్లను పద్మశ్రీ అవార్డు కోసం సిఫార్సుచేయనున్నట్లు ఆ శాఖ మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ వెల్లడించారు.  

ఎరువుల ధరల సవరణకు అనుమతి
న్యూఢిల్లీ: జీఎస్టీ అమల్లోకి రాకముందు తయారైన ఎరువుల ధరలు సవరిం చుకు నేందుకు కేంద్రం అనుమతిచ్చింది. దీంతో దాదాపు 10 లక్షల టన్నుల పాత ఎరువుకు కంపెనీలు జీఎస్టీ ప్రకారం ధరలు ముద్రిం చుకోవచ్చు. జీఎస్టీలో ఎరువులపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఎరువుల రిటైల్‌ ధరలు తగ్గనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement