ఇక్కడ డాన్లకు స్థానం లేదు | No Place For Dons In Bihar, Says Nitish Kumar, Rebuked On Shahabuddin | Sakshi
Sakshi News home page

ఇక్కడ డాన్లకు స్థానం లేదు

Published Tue, Sep 27 2016 11:57 AM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM

ఇక్కడ డాన్లకు స్థానం లేదు

ఇక్కడ డాన్లకు స్థానం లేదు

పట్నా: బిహార్లో గ్యాంగ్స్టర్లకు స్థానం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. పారిశ్రామిక వేత్తల సమావేశంలో నితీష్ మాట్లాడుతూ.. బయట ఏ డాన్ ఉన్నా సరే, జైలుకు వెళ్లాల్సిందేనని చెప్పారు.

జంట హత్యల కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ, గ్యాంగ్స్టర్ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్పై విడుదల కావడాన్ని సవాల్ చేస్తూ బిహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. షాబుద్దీన్ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో నితీష్ చేసిన వ్యాఖ్యలు.. షాబుద్దీన్, ఆయనకు మద్దతుగా ఉన్న ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ను ఉద్దేశించినవిగా భావిస్తున్నారు. చట్టం విషయంలో రాజీపడబోమని, ఫిర్యాదు చేసే అవకాశాన్ని మిత్రపక్షాలకు ఇవ్వబోనని నితీష్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టుకట్టి నితీశ్ అధికారంలోకి వచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement