
మేనల్లుడిని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి..
ఈ ఘటన కర్కశత్వానికి పరాకాష్ట. వికృత ఆలోచనకు విశ్వరూపం. చూసినవారికి ఒళ్లు జలదరించి గజగజా వణికిపోతూ ఓ మూలన కూర్చుని బిక్కుబిక్కుమనేలా చేసే దృశ్యం.
భోపాల్: ఈ ఘటన కర్కశత్వానికి పరాకాష్ట. వికృత ఆలోచనకు విశ్వరూపం. చూసినవారికి ఒళ్లు జలదరించి గజగజా వణికిపోతూ ఓ మూలన కూర్చుని బిక్కుబిక్కుమనేలా చేసే దృశ్యం. స్కూల్కు వెళ్లలేదని ఓ మేనమామ తన మేనల్లుడిని ఇప్పటి వరకు ఎవరు విధించని రీతిలో శిక్ష విధించాడు. బెదిరించడం, కోపం తెప్పిస్తే చేయిచేసుకోవడంలాంటివో మానేసి ఏకంగా చెట్టుకు వేలాడదీశాడు.
చిన్న పిల్లవాడని కూడా చూడకుండా ఆ ఊరి నడి బొడ్డున నలుగురు రచ్చబండకు చేరి ముచ్చట్లాడుకునే చోట ఓ చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి చరిత్రలో ఎవరూ చేయని విధంగా దండించాడు. మధ్యప్రదేశ్లోని రైజెన్ జిల్లాలో బ్రిజేశ్ యాదవ్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో కెమెరాకు చిక్కి వెలుగులోకి రావడంతో పోలీసులు బ్రిజేశ్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు.