బక్సర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రత్యర్థులు నితీశ్‌కుమార్-లాలూప్రసాద్ యాదవ్ ద్వయంపై తన దాడిని మరింత తీవ్రం చేశారు. ఆయన సోమవారం బిహార్‌లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగిస్తూ.. 'ఏదైనా ప్రభుత్వం రిజర్వేషన్ పరిమితిని 50శాతానికి మించి కొనసాగించాలని భావిస్తే.. అది మిమ్మల్ని మోసం చేయడమే. దళితులు, మహా దళితులు, వెనుకబడిన వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాల నుంచి 5శాతం కోటాను తొలగించి వేరే వర్గానికి ఇవ్వడానికే వారు కుట్ర చేస్తున్నారు' అని పేర్కొన్నారు.
ఇది పాపల కుట్ర వంటిందని అభివర్ణించారు. ఈ కుట్రను తాము కొనసాగనివ్వబోమని చెప్పారు. 'మీ రిజర్వేషన్‌ను తీసుకొని వేరే వర్గానికి ఇవ్వడానికి మేము అనుమతి ఇవ్వబోం. మోదీ తన ప్రాణాలను ఒడ్డి మీ హక్కులను కాపాడుతారు' అని ఆయన తెలిపారు. లాలూ మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు.
'పాపాల కుట్ర నుంచి రిజర్వేషన్లను కాపాడుతా'
Published Mon, Oct 26 2015 6:38 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement