మ్యాగ్జిమ్ కవర్ పేజీపై ప్రియాంక | Priyanka Chopra unveils the controversial mag cover | Sakshi
Sakshi News home page

మ్యాగజీన్ పై వివాదాస్పద ఫోజు!

Published Fri, Jul 1 2016 4:26 PM | Last Updated on Mon, Oct 8 2018 4:24 PM

మ్యాగ్జిమ్ కవర్ పేజీపై ప్రియాంక - Sakshi

మ్యాగ్జిమ్ కవర్ పేజీపై ప్రియాంక

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా తాజాగా మ్యాగ్జిమ్ కవర్ పేజీపై బోల్డ్ పోజిచ్చింది. గురువారం జరిగిన ఈ కవర్ పేజీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ప్రియాంక తన స్టన్నింగ్ లుక్ తో అదరగొట్టింది. మోనిషా జైసింగ్ రూపొందించిన నేవి బ్లూ గౌన్ లో ఈ వేడుకకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా తన హాలీవుడ్ తొలి చిత్రం  'బేవాచ్' గురించి ముచ్చటించింది.

'బాజీరావు మస్తానీ'లో తన సహనటి అయిన దీపికా పదుకొణేతో తన 'ఈక్వెషన్స్' బాగానే ఉన్నాయని, తాము ఇప్పటికీ మంచి స్నేహితులమేనని ప్రియాంక చెప్పింది. అయితే హలీవుడ్ లో తనకన్నా దీపికకు మంచి ఆఫర్లు వస్తుండటంపై మాత్రం స్పందించడానికి నిరాకరించింది. ఒకరికి వస్తున్న ఆఫర్ల గురించి నేనెందుకు స్పందించాలి? ఆ అవసరం నాకు లేదంటూ ప్రియాంక తోసిపుచ్చింది. కాగా, మాగ్జిమ్ కవర్ పై ప్రియాంక బోల్డ్ పోజు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement