పీటీసీ ఇండియా
బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.58
టార్గెట్ ధర: రూ.76
ఎందుకంటే: భారత్‌లో అగ్రశ్రేణి విద్యుత్ ట్రేడింగ్ కంపెనీ. భారీ విద్యుత్ ప్రాజెక్టులకు ఊతాన్నిచ్చే ఉద్దేశంతో 1999లో ఏర్పాటు చేశారు. రిబేట్/సర్‌చార్జీ ఆదాయం కారణంగా క్యూ3 ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం రూ.2,750 కోట్లకు, నికర లాభం రూ.91 కోట్లకు పెరిగాయి. గతేడాది చివరి నాటికి నగదు నిల్వలు రూ.800 కోట్లుగా ఉన్నాయి. రిబేట్/సర్‌చార్జీ ఆదాయం పెరుగుతుండడం, అమ్మకాల పరిమాణం వృద్ధి చెందుతుండడం, ఇతర ఆదాయం అధికంగా ఉండడం డిస్కమ్‌ల నుంచి నగదు వసూళ్లు పెరుగుతుండడం వంటి కారణాల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 57 శాతం వృద్ధితో రూ. 310 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.
రాష్ట్రాల మధ్య విద్యుత్ ప్రసారానికి అనుమతించడం, కొత్త పవర్ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభించడం, అంతరాష్ట్ర గ్రిడ్ అనుసంధానానికి ఆటంకాలు తొలగుతుండడం వంటి కారణాల వల్ల కంపెనీ మార్కెట్ విస్తృతం అవుతోంది. రాష్ట్రాల విద్యుత్ బోర్డ్‌ల ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, విద్యుత్ సంబంధిత నిబంధనలు మారే అవకాశలు, స్వల్పకాలిక మార్కెట్లో పోటీ పెరుగుతుండడం ప్రభా వం చూపించే అంశాలు.