కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ నేతలపై వస్తున్న ఆరోపణలకు ఆ పార్టీ జుల్పాయ్‌గురి జిల్లా అధ్యక్షుడు సౌరభ్ చక్రవర్తి సరికొత్త భాష్యం చెప్పారు. అత్యాచారం ఆరోపణల వల్ల పార్టీకి బలం చేకూరుతుందే తప్ప ఎటువంటి నష్టం లేదని వ్యాఖ్యానించారు. పశ్చిమబెంగాల్‌లో ఓ బాలిక గ్యాంగ్ రేప్, హత్యకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సౌరభ్ స్పందిస్తూ.. అత్యాచారం అనేది సామాజిక రోగం లాంటిదని, అటువంటివి జరుగుతూనే ఉంటాయని, అలాగే ఆరోపణలు కూడా వస్తుంటాయని చెప్పారు.
ఇలాంటి ఆరోపణలు ఎంత పెరిగితే.. అదే మాదిరిగా తమ పార్టీ సభ్యత్వాలు పెరుగుతాయన్నారు. అయితే సౌరభ్ వ్యాఖ్యలను సీపీఎం నేత సుజన్ చక్రవర్తితో పాటు పలువురు మహిళా సంఘాల నేతలు ఖండించారు.