అన్నీ ఆయన ఆమోదంతోనే... | Ratan Tata Approved Fully Of How DoCoMo Was Handled, Says Cyrus Mistry | Sakshi
Sakshi News home page

అన్నీ ఆయన ఆమోదంతోనే...

Published Tue, Nov 1 2016 4:50 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM

అన్నీ ఆయన ఆమోదంతోనే...

అన్నీ ఆయన ఆమోదంతోనే...

ముంబై: జపనీస్ సంస్థతో టెలికాం ఒప్పందం నేపథ్యంలో  పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్న  టాటా-మిస్త్రీ వివాదం మళ్లీ రాజుకుంది. రెండు రోజుల మౌనం తరువాత ఈ వ్యవహారంలో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (48)మరోసారి టాటాలపై విరుచుకుపడ్డారు. డొకొమో వివాదం రతన్ టాటా వ్యవహార సరళికి భిన్నమైనదనీ,  టాటా  విలువలకు, సంస్కృతికి వ్యతిరేకంగా మిస్త్రీ వ్యవహరించారన్న ఆరోపణలు నిరాధారమైనవని ఆరోపించారు. 2009లో జపాన్ సంస్థతో డొకొమో ఒప్పంద సంతకాలు మిస్త్రీ నియామకానికి ముందే  జరిగాయని మిస్త్రీ కార్యాలయ వర్గాలు మంగళవారం స్పష్టం చేశాయి.  టాటా డొకొమో ఒప్పంద నిర్ణయాలు మిస్త్రీ సొంతంగా తీసుకున్నారని, సంస్థకు తీవ్ర నష్టం కలిగించారన్న ఆరోపణలు తీవ్రంగా ఖండించాయి. మొదటినుంచి చివరి వరకూ  ప్రతి  అడుగూ ఆయన ఆమోదంతోనే పడిందని తెలిపాయి.

ఒప్పంద చర్చలు టాటా బోర్డ్ ఆధ్వర్యంలోనే జరిగినట్టు వివరణ ఇచ్చారు.   ఇవన్నీ టాటా సన్స్ బోర్డు ఆమోదంతోనే  తీసుకున్న సమిష్టి నిర్ణయాలని  చెప్పారు.  నిర్ణయాలు  టాటా సన్స్ బోర్డు ఏకగ్రీవ ఆమోదం తో నిర్ణయాలని చెప్పారు.   అలాగే ఈ మొత్తం  సమాచారాన్ని రతన్ టాటా,    సూనావాలా,  ట్రస్టీలకు ఎప్పటికపుడు అందించినట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలో లీగల్  కౌన్సిల్ సమావేశాల్లో, మిస్త్రీతో ప్రత్యేక సమావేశాల్లో కూడా  వీరు పాల్గొన్నారని స్పష్టం  చేశాయి.  వాస్తవాలు  ఇలా ఉండగా  'టాటా విలువలు', లేదా రతన్ టాటా,  సూన్ వాలా  అభిమతానికి  విరుద్ధంగా   మిస్త్రీ తన స్వంత  నిర్ణయం తీసుకున్నారనడం   బూటకమనీ, దుర్మార్గమని వాదించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement