బుగ్గ కార్లపై కేంద్రానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు
న్యూఢిల్లీ : వీఐపీల బుగ్గకార్లపై సుప్రీంకోర్టు మంగళవారం కేంద్రానికి ఉత్తర్వులు జారీ చేసింది. నీలిరంగు బీకర్లను అంబులెన్స్, పోలీసులు మాత్రమే అత్యవసర సమయాల్లో ఉపయోగించాలని సూచించింది. అలాగే ఎరుపు రంగు బుగ్గకార్లు రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవారు మాత్రమే ఉపయోగించాలని, పదవులు నోటిపై చేయాలని న్యాయస్థానం పేర్కొంది.
కాగా ప్రతిష్టకు సంకేతంగా భావిస్తూ బుగ్గకార్ల (కార్లపై రెడ్‌లైట్ల)తో వెలిగిపోతున్న పలువురు వీఐపీలు, ఉన్నతాధికారులు ఇకపై ఈ అవకాశాన్ని కోల్పోనున్నారు. ఇంతవరకు జిల్లాధికారులు, జిల్లా మేజిస్ట్రేట్‌లు, ఎస్పీలు, పార్లమెంటు సభ్యులు, ఇతర వీఐపీలకు ఉన్న ఈ సదుపాయం తొలగిపోనుంది. ఇంతవరకు 30 కేటగిరీలకు చెందిన వీఐపీలకు బుగ్గ కార్ల సదుపాయం ఉండేది.
ప్రభుత్వ వర్గాలు తెలిపిన మేరకు అర్హత లేకున్నా కొందరు తాలూకా స్థాయి అధికారులు కూడా అనధికారికంగా ఈ సౌకర్యాన్ని పొందేవారు. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు కేవలం ఐదు కేటగిరీలకు చెందిన వీఐపీల కార్లపై మాత్రమే రెడ్‌లైట్లు వెలగనున్నాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు ఓ ప్రజోపయోగ వ్యాజ్యంలో తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు బూటకపు ఎన్కౌంటర్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసు విచారణను జస్టిస్ ఆర్పీ దేశాయ్, జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనం....ప్రత్యేక బెంచ్కు బదిలీ చేసింది.