
నడిరోడ్డు మీద నలుగురు చూస్తుంటే..
ముంబైలో అది రద్దీ రోడ్డు. వాహనాలు ఇటు-అటు వెళుతున్నాయి.
ముంబైలో అది రద్దీ రోడ్డు. వాహనాలు ఇటు-అటు వెళుతున్నాయి. ఇంతలో మధ్య వయస్సున్న వ్యక్తి ఆ రోడ్డు మీదకొచ్చాడు. ఇటు-అటు పోతున్న వాహనాలను ఏమాత్రం పట్టించుకోకుండా.. నలుగురు చూస్తున్నా లెక్కచెయకుండా స్టెప్పులు వేయడం మొదలుపెట్టాడు. ఏదో ఆషామాషీ చిందులు కాదు.. తనలో తాను నవ్వుకుంటూ, ఏదో పాటను పాడుకుంటూ కిర్రాక్ డ్యాన్స్‌లు చేశాడతడు.
నడిరోడ్డు మీద అతడు నర్తన ప్రదర్శన మొదలుపెట్టడంతో చుట్టూ ముగినవారు.. ఇదేదో బాగుందో అనుకుంటూ ఆనందించారు. వాళ్లు ఆనందించడానికి అన్నట్టు మధ్యమధ్యలో కొన్ని పిచ్చిపిచ్చి చేష్టలు, అల్లరి పనులు చూస్తూ చూపరులను ఆకట్టుకున్నాడు ఆ వ్యక్తి. యూట్యూబ్‌లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు హల్‌చల్ చేస్తుంది. అతడి డ్యాన్స్ బాగుందో..లేదో.. మీరు కూడా లుక్కేయండి.