సత్య నాదెళ్ల జీతం ఏడాదికి 112 కోట్లు!! | Satya Nadella to get $1.2 mn salary; total package at $18 mn | Sakshi
Sakshi News home page

సత్య నాదెళ్ల జీతం ఏడాదికి 112 కోట్లు!!

Published Wed, Feb 5 2014 4:33 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

సత్య నాదెళ్ల జీతం ఏడాదికి 112 కోట్లు!! - Sakshi

సత్య నాదెళ్ల జీతం ఏడాదికి 112 కోట్లు!!

మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈవోగా ఎంపికైన తెలుగు తేజం సత్య నాదెళ్ల ఏడాదికి ఎంత జీతం తీసుకోబోతున్నారో తెలుసా.. అక్షరాలా 112 కోట్లు!! బోనస్, స్టాక్ అవార్డులు, అన్నీ కలిపి ఈ మొత్తం ఆయనకు అందుతుంది. అయితే బేస్ శాలరీ రూపంలో మాత్రం ఆయనకు అందేది ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయలు మాత్రమే. మైక్రోసాఫ్ట్లో 22 ఏళ్లుగా పనిచేస్తున్న సత్య నాదెళ్ల (46)కు 0-300 శాతం వరకు బోనస్ కూడా అందుతుంది. దీంతోపాటు ఈయనకు స్టాక్ అవార్డులు కూడా అందుతాయి. ఇవన్నీ కలిపితే ఆయనకు మొత్తం 112 కోట్ల రూపాయలు ఏడాదికి అందుతాయి.

ఆయన వార్షిక వేతనాన్ని కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇన్సెంటివ్ ప్రోగ్రాం (ఈఐపీ) నిర్ణయిస్తుంది. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయనకు వార్షిక ఈఐపీ స్టాక్ అవార్డు అందుతుందని నాదెళ్లకు మైక్రోసాఫ్ట్ నుంచి అందిన ఆఫర్ లెటర్లో పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తమ్మీద అందిన జీతానికి గరిష్ఠంగా మూడు రెట్లు.. అంటే 300 శాతాన్ని యాన్యువల్ క్యాష్ అవార్డుగా అందిస్తారు. అయితే, ఆయన పనితీరును బట్టి ఎంత శాతం ఇవ్వాలనే విషయాన్ని బోర్డు నిర్ణయిస్తుందని ఆఫర్ లెటర్లో తెలిపారు. ఈ లేఖ కాపీని అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థ ఎస్ఈసీకి కూడా పంపారు. బిల్ గేట్స్, స్టీవ్ బామర్ తర్వాత నాదెళ్ల సత్యనారాయణ చౌదరే ఈ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవో అయ్యారు. గత సంవత్సరం నాదెళ్లకు దాదాపు పది కోట్ల రూపాయలు క్యాష్ బోనస్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement