రాహుల్తో సీమాంధ్ర మంత్రుల భేటీ
న్యూఢిల్లీ: సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం వీరు రాహుల్ను కలిసి తెలంగాణ బిల్లు విషయంపై చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ.. బిల్లులో తాము ప్రతిపాదించిన సవరణలను రాహుల్కు వివరించామని చెప్పారు. సీమాంధ్రకు పన్ను రాయితీ ఇవ్వాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరామని వివరించారు. వీటి పట్ల రాహుల్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
బిల్లులో సవరణలను చేర్చే విషయంపై జీవోఎంతో మాట్లాడుతానని రాహుల్ హామీ ఇచ్చారని చెప్పారు. కాగా హైదరాబాద్ను యూటీ చేయాలన్న ప్రతిపాదనపై రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి చెప్పారు. ఇదిలావుండగా, తెలంగాణ బిల్లుపై లోక్సభలో రేపు చర్చించనున్నారు. ఈ మేరకు లోక్సభ షెడ్యూల్లో చేర్చారు.