బీజేపీ-టీడీపీ నమ్మకద్రోహాన్ని ఏపీ చూస్తోంది: రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ-టీడీపీ చేస్తున్న నమ్మక ద్రోహాన్ని ఐదు కోట్ల ఆంధ్రులు గమనిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీటర్లో హెచ్చరించారు. ‘మోదీ జీ మీకు గుర్తుచేస్తున్నా.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఈ దేశ పార్లమెంటు 2014లో నిర్ణయం తీసుకుంది..’ అని పేర్కొన్నారు. శుక్రవారం రాజ్యసభలో కేవీపీ ప్రయివేటు మెంబర్ బిల్లును మనీ బిల్లా కాదా అనే విషయం తేల్చేందుకు లోక్‌సభ స్పీకర్ నిర్ణయం కోసం పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ ట్వీట్ చేశారు.
కాగా, హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను టీడీపీ మోసం చేస్తోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లు విషయంలో టీడీపీ కుట్ర పన్నిందని ఢిల్లీలో మండిపడ్డారు.