ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు | Sensex, Nifty flat ahead of RBI policy; Hero down, Idea slips 4% | Sakshi
Sakshi News home page

ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు

Published Tue, Aug 9 2016 10:02 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు

ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు

ముంబై : ఏడాది గరిష్ట లాభంలో ముగిసిన సోమవారం నాటి మార్కెట్లు నేటి ట్రేడింగ్లో స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. కొన్ని గంటల్లో ఆర్బీఐ గవర్నర్ తన తుది ద్రవ్యవిధాన పరపతి సమీక్ష ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.  ప్రస్తుతం సెన్సెక్స్ 25.19 పాయింట్ల నష్టంతో 28,157 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 11.80 పాయింట్ల నష్టంతో 8,699గా ట్రేడ్ అవుతోంది.

లుపిన్, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, మహింద్రా అండ్ మహింద్రా, కోల్ ఇండియా టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా.. బజాజ్ ఆటో, టీసీఎస్, హీరో మోటార్ కార్పొ, రిలయన్స్, ఇన్ఫోసిస్ టాప్ లూజర్లుగా నష్టాలను చవిచూస్తున్నాయి. నిరాశపర్చిన క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఐడియా 4శాతం మేర డౌన్ అయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సంకేతాలు మిక్స్డ్గా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement