'పవార్ స్క్రిప్ట్ ప్రకారమే పొత్తు విచ్ఛిన్నం'
ఔరంగాబాద్: బీజపీ, శివసేన మధ్య పాతికేళ్లుగా ఉన్న పొత్తు విచ్ఛిన్నం కావడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కారణమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ ఠాక్రే ఆరోపించారు. పొత్తుకు స్వస్తి చెబితే బీజేపీకి ఎన్సీపీ మద్దతు ఇస్తుందంటూ పవార్ హామీ ఇవ్వడంవల్లనే బీజేపీ, శివసేన మధ్య పొత్తువిచ్ఛిన్నమైందని రాజ్ అన్నారు. ముంబైలో బుధవారం రాత్రి జరిగిన పార్టీ మద్దతుదార్ల సమావేశంలో రాజ్ ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో రెండు గ్రూపుల పొత్తులు దెబ్బతినడానికి, రాజకీయ గందరగోళానికి కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ, శివసేన పార్టీల వైఖరే కారణమని విమర్శించారు.