సోనియా భారతీయులందరికీ తల్లి: ఖుర్షీద్ | Sonia Gandhi is a mother to all Indians: Salman Khurshid | Sakshi
Sakshi News home page

సోనియా భారతీయులందరికీ తల్లి: ఖుర్షీద్

Published Thu, Dec 12 2013 3:43 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 AM

సోనియా భారతీయులందరికీ తల్లి: ఖుర్షీద్

సోనియా భారతీయులందరికీ తల్లి: ఖుర్షీద్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీని భారతీయులందరికీ తల్లిగా వర్ణించారు విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. ఓ వార్తా చానల్తో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 'రాహుల్ గాంధీకి మాత్రమే సోనియా అమ్మకాదు. ఆమె మా అందరికీ అమ్మే. మొత్తం భారతదేశానికి ఆమె అమ్మ లాంటివారు' అని ఖుర్షీద్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించకుంటే సోనియా గాంధీయే ప్రధాని అభ్యర్థి కావాలని మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ఖుర్షీద్ స్పందించారు. ఇటువంటి వ్యాఖ్యలు గతంలోనూ వచ్చాయని గుర్తు చేశారు. నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో రాహుల్ గాంధీ నాయకత్వంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement