వాల్సన్ తంపూ(ఫైల్)
న్యూఢిల్లీ: తనకు ఇవ్వాల్సిన స్టైఫండ్ నిలిపి వేశారని ప్రొఫెసర్ పై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసిన సెయింట్ స్టీఫెన్ కాలేజీ పరిశోధక విద్యార్థిని వాపోయారు. తనను లైబ్రరీలోకి కూడా అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలను సెయింట్ స్టీఫెన్ కాలేజీ ప్రిన్సిపాల్ వాల్సన్ తంపూ ఖండించారు.
తాను బలవంతంగా లైబ్రరీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా తనను గదిలో పెట్టి అటెండర్లు బంధించారని బాధితురాలు తెలిపింది. పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి తనను విడిపించారని చెప్పింది. కాగా, తాను ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన నాలుగు ఆడియో టేపులను గతవారం పోలీసులకు ఆమె ఇచ్చింది. ప్రొఫెసర్ సతీశ్ కుమార్ పై పెట్టిన లైంగిక వేధింపుల కేసును ఉపసంహరించుకోవాలని తనపై ప్రిన్సిపాల్ ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించింది. ఈ కేసును నీరుగార్చేందుకు వాల్సన్ తంపూ ప్రయత్నించారని పేర్కొంది.