ఫేస్బుక్లో తప్పుడు ఆరోపణలు.. 50వేల జరిమానా | Student fined for making false allegations on Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్బుక్లో తప్పుడు ఆరోపణలు.. 50వేల జరిమానా

Published Thu, Feb 27 2014 3:52 PM | Last Updated on Fri, Nov 9 2018 4:20 PM

ఫేస్బుక్లో తప్పుడు ఆరోపణలు.. 50వేల జరిమానా - Sakshi

ఫేస్బుక్లో తప్పుడు ఆరోపణలు.. 50వేల జరిమానా

చేతిలో మొబైల్ ఉంది, అందులో ఫేస్బుక్ వస్తోంది కదాని ఏది పడితే అది రాసేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త. ఈటానగర్లో ఓ కుర్రాడు ఇలాగే ఫేస్బుక్లో తమ కాలేజీ ప్రిన్సిపాల్ మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు అతడికి 50వేల రూపాయల జరిమానా పడింది.

చేతిలో మొబైల్ ఉంది, అందులో ఫేస్బుక్ వస్తోంది కదాని ఏది పడితే అది రాసేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త. ఈటానగర్లో ఓ కుర్రాడు ఇలాగే ఫేస్బుక్లో తమ కాలేజీ ప్రిన్సిపాల్ మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు అతడికి 50వేల రూపాయల జరిమానా పడింది. తూర్పు సయాంగ్ జిల్లాలోని పసీఘాట్ పట్టణంలో గల జవహర్లాల్ నెహ్రూ కాలేజీలో మిబోం లిబాంగ్ అనే విద్యార్థి బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తయెక్ తలోంపై అతడు ఫేస్బుక్లో తప్పుడు ఆరోపణలు చేశాడు. కాలేజీలో వసూలైన విద్యార్థుల ఫీజులో 40 శాతం మొత్తాన్ని ప్రిన్సిపాల్ తినేశారని అతడు ఫేస్బుక్లో ఆరోపించాడు. దీనిపై స్థానికులు, అధ్యాపక వర్గాలు, విద్యార్థులు అందరూ తీవ్రంగా స్పందించారు. ఈ విషయం అక్కడి పంచాయతీ దృష్టికి వెళ్లింది. అక్కడ విచారణలో ఆరోపణల్లో నిజం లేదని తెలియడంతో అతడికి 50 వేల రూపాయల జరిమానా విధించారు. అంతేకాక.. ఫేస్బుక్, కాలేజి నోటీసు బోర్డు ద్వారా బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement