పన్నీర్‌ సెల్వానికి తమిళ సూపర్‌ స్టార్‌ మద్దతు! | super star comment on panneerselvam | Sakshi
Sakshi News home page

పన్నీర్‌ సెల్వానికి తమిళ సూపర్‌ స్టార్‌ మద్దతు!

Published Wed, Feb 8 2017 7:45 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

పన్నీర్‌ సెల్వానికి తమిళ సూపర్‌ స్టార్‌ మద్దతు!

పన్నీర్‌ సెల్వానికి తమిళ సూపర్‌ స్టార్‌ మద్దతు!

తమిళనాట ముఖ్యమంత్రి పదవి కోసం వీకే శశికళ, పన్నీర్‌ సెల్వం మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న రాజకీయ పోరుపై తమిళ సూపర్‌స్టార్‌, విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడిన ఆయన.. పరోక్షంగా ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌ సెల్వానికి మద్దతునిచ్చారు. 'ఓపీఎస్‌ రాష్ట్రానికి మంచి మంచి చేస్తున్నారు. నేను ఆయన అభిమానిని కాదు, కానీ ఆయన మంచి చేస్తున్నారు. మేం స్తబ్దుగా ఉండటంవల్లే ఇలాంటి పరిణామాలను సహిస్తున్నాం. అందుకు దారుణమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నాయి' అని ఆయన పేర్కొన్నారు.

అంతకుముందు తమిళనాడు వ్యవహారాలపై ఆయన కొన్ని ఆసక్తికర ట్వీట్స్‌ చేశారు. శశికళ, ఓపీఎస్‌ విషయంలో అభిప్రాయభేదాలు ఉన్నంతమాత్రాన తమిళనాడును నిట్టనిలువునా చీల్చవద్దని పేర్కొన్నారు. అహింసాయుతంగా పోరాడితే యావత్‌ దేశం తమిళనాడుకు అండగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత పరిణామాలపై సినీనటులు స్పందించాలని, కనీసం డబ్‌స్మాష్‌ వీడియోలైనా పెట్టాలని ఆయన కోరారు. తప్పుడు రాజకీయ నాయకులను నమ్మడం ద్వారా మనం మన స్వాతంత్ర్యాన్ని వృథా చేసుకున్నామని, ఇకనైనా వారిని వేలెత్తిచూపేముందు మనమే సరిగ్గా ఉండటం నేర్చుకుందామని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement