తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి మద్దతివ్వండి | Support to the Telugu language Conservation Movement | Sakshi
Sakshi News home page

తెలుగు భాష పరిరక్షణ ఉద్యమానికి మద్దతివ్వండి

Published Thu, Feb 23 2017 3:22 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

Support to the Telugu language Conservation Movement

సీఎం కేసీఆర్‌కు తమిళనాడు తెలుగు యువశక్తి వినతి

సాక్షి, తిరుమల: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును బుధవారం తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి తిరుమలలోని అతిథిగృహంలో కలసి పుష్పగుచ్ఛంతో అభినందనలు తెలిపారు. తెలుగు భాష పరిరక్షణకు తమిళనాడులో తాము చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై మాట్లాడేందుకు హైదరాబాద్‌కు రావాలని కేసీఆర్‌ తెలిపినట్లు కేతిరెడ్డి మీడియాకు వెల్లడించారు.

తమిళనాడులో తెలుగు పరిరక్షణకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహకారం అవసరమన్న విషయాన్ని గుర్తు చేశామన్నారు. తెలంగాణ ఉద్యమం, తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం కంటే తెలుగు భాష పరిరక్షణ ఉద్యమం అతి ముఖ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్‌ కుమార్తె ఎంపీ కవిత డిమాండ్‌ చేయడం వారిలో ఉన్న ఉద్యమ స్ఫూర్తికి నిదర్శనమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement