
యూపీఏ సర్కార్ దేశాన్ని లూటీ చేసింది
యూపీఏ సర్కార్పై బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మాస్వరాజ్ నిప్పులు చెరిగారు. భారతీయ జనత పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు వరుసగా మూడవ రోజు ఆదివారం ఇక్కడ ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్ మాట్లాడుతూ... యూపీఏ ప్రభుత్వ పదేళ్ల పాలనలో దేశాన్ని లూటీ చేసిందని ఆరోపించారు.
సరిహద్దుల్లో సైనికుల తలలు తెగుతున్నా ప్రధాని మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం కాంగ్రెస్ పార్టీని పట్టి పీడిస్తుందని ఆరోపించారు. అందుకే ప్రధాని అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించలేదన్నారు. తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరు గత సెప్టెంబర్లోనే ప్రకటించిన విషయాన్ని సుష్మా ఈ సందర్బంగా గుర్తు చేశారు.