రాంచీలో నరేంద్ర మోడీ టీ స్టాల్!
Published Wed, Oct 9 2013 2:29 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
స్పూర్తి పొందిన నాయకుల, వ్యక్తుల పేర్లను పిల్లలకు పెట్టుకోవడం సర్వ సాధారణమైన విషయం అన్నది అందరికి తెలిసిందే. టీ కొట్టు స్థాయి నుంచి బీజేపీ తరపున దేశ ప్రధాని అభ్యర్థి వరకు ఎదిగిన నరేంద్ర మోడీ పేరును జార్ఖండ్ రాజధాని రాంచీలో తన టీ కొట్టుకు నరేంద్ర మోడీ పేరును పెట్టుకోవడం అందర్ని ఆకర్షించింది.
రాంచీలోని స్టేషన్ రోడ్డులో ఉన్న నమో నమో టీస్టాల్ అంతా నరేంద్ర మోడీ పోటోలతో నిండిపోయింది. వినయశర్మ అనే వ్యక్తి నడిపే ఈ టీస్టాల్ ను ఇటీవలే జార్ఖండ్ మాజీ స్పీకర్, రాంచీ బీజేపీ ఎమ్మెల్యే సీపీ సింగ్ లు ప్రారంభించారు.
గతంలో మోడీ టీ స్టాల్ నడిపేవారని..ఆయనపై ఉన్న గౌరవం ఉన్న కారణంగానే టీస్టాల్ కు నమో అని పేరు పెట్టానన్నారు. పేదరికం నుంచి దేశ ప్రధాని అభ్యర్థి హోదా వరకు ఎదిగిన మోడీ పేరుతో ఉన్న టీస్టాల్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే సింగ్ తెలిపారు.
Advertisement
Advertisement