టాయిలెట్ కు వెళ్లాలంటే డాక్టర్ సర్టిఫికేట్ కావాలి!
బ్రిటన్‌లోని ఓ స్కూలు నుంచి వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌ను చూసి అవాక్కవ్వడం తల్లిదండ్రుల వంతైంది. ‘‘మీ పిల్లలు క్లాసు మధ్యలో టాయిలెట్‌కు వెళ్లాలంటే... వచ్చే వారానికల్లా ఈ మేరకు డాక్టర్ నోట్‌ను సమర్పించండి. పాస్‌లు జారీచేస్తాం’’ అని కార్డిఫ్‌లోని వేల్స్ హైస్కూల్ యాజమాన్యం ఎస్సెమ్మెస్ పంపింది. దీన్ని చూసి పేరెంట్స్ డంగైపోయారు. స్కూల్ వాదనేమిటంటే... పదకొండో తరగతికి వచ్చిన పిల్లలు ఒక నియమపద్ధతికి అలవాటుపడతారని, అతిమూత్రం తదితర ఆరోగ్య సమస్యలుంటే... దాన్నే తెలియజేస్తూ డాక్టర్ నోట్‌ను సమర్పించాలని తాము చెప్పామంటోంది.
ఇదెక్కడి గోల బాబు... ఒకటికి వెళ్లాలన్నా డాక్టర్ సర్టిఫికెట్ తేవాలనడమేమిటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకామైతే డాక్టర్‌తో కూడా మాట్లాడిందట. 25 పౌండ్లు (భారత కరెన్సీలో 2,500 రూపాయలు) అవుతుందని డాక్టరుగారు చెప్పారట. ఇదో అదనపు వాయింపని పేరెంట్స్ నిట్టూరుస్తున్నారు.