
‘ఎం-ఓటింగ్’ యాప్‌ను
దేశీ దిగ్గజ ఈ-ఓటింగ్ సర్వీస్ ప్రొవైడర్ ‘సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్’ (సీడీఎస్‌ఎల్) తాజాగా ‘ఎం-ఓటింగ్’ అనే.....
ఆవిష్కరించిన సీడీఎస్‌ఎల్
హైదరాబాద్: దేశీ దిగ్గజ ఈ-ఓటింగ్ సర్వీస్ ప్రొవైడర్ ‘సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్’ (సీడీఎస్‌ఎల్) తాజాగా ‘ఎం-ఓటింగ్’ అనే మొబైల్ యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. షేర్‌హోల్డర్లు ఈ యాప్ సాయంతో కంపెనీ తీర్మానాలకు సంబంధించిన ఓటింగ్‌లో ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చని సీడీఎస్‌ఎల్ తెలిపింది. ఏజీఎం/ఈజీఎం వేదికల్లో కూడా ఈ-ఓటింగ్ విధానాన్ని అవలంభించవచ్చని పేర్కొంది. ఈ కొత్త యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో మాత్రమే పనిచేస్తుందని, త్వరలోనే విండోస్ ఫోన్, ఐఫోన్ యూజర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని వివరించింది.
వినియోగదారులు ‘ఎం-ఓటింగ్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. కాగా సీడీఎస్‌ఎల్ దేశంలోనే తొలిసారిగా 2009లో ఈ-ఓటింగ్ విధానాన్ని ప్రారంభించింది. ఇప్పటి వరకు 4,250 కంపెనీలు ఇందులో భాగస్వామ్యమయ్యాయి. వీటిల్లో 3,800 కంపెనీలు 8,215 ఈ-ఓటింగ్ కార్యక్రమాల్లో సీడీఎస్‌ఎల్ విధానాన్ని అనుసరించాయి.