మాస్కో: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధతంత్రాలు కూడా మారిపోతున్నాయి. భవిష్యత్తులో జరిగేదంతా ఎలక్ట్రానిక్ యుద్ధమేనంటున్నారు నిపుణులు. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఇప్పటికే మానవరహిత యుద్ధ యంత్రాలు, వాహనాలను సమకూర్చుకుంటున్నాయి. ఈ విషయంలో రష్యా ఒక అడుగు ముందే ఉంది.
యుద్ధక్షేత్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సంక్షిప్త సందేశాలు, ఆడియో, వీడియో మెసేజ్‌లు పంపే సరికొత్త అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్(యూఏవీ)ని తయారుచేసింది. దీని ప్రత్యేకత ఏంటంటే కేవలం సందేశాలు పంపడమే కాకుండా యుద్ధం జరిగే ప్రాంతంలో సెల్ టవర్ల సిగ్నళ్లను జామ్ చేయడం దీని మరో ప్రత్యేకత. ఫలితంగా ప్రత్యర్థి సమాచార వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసి శత్రువుపై పైచేయి సాధించేందుకు ఈ యూఏవీని రూపొందించినట్లు రష్యన్ దినపత్రిక ఇజ్వెస్టియా పేర్కొంది
రష్యా సైన్యం చేతికి అధునాతన యూఏవీ
Published Thu, Jan 26 2017 12:18 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
Advertisement
Advertisement