'కేంద్రంలో థర్డ్ ఫ్రంట్దే అధికారం' | Third Front will form government, says Mulayam Singh Yadav | Sakshi
Sakshi News home page

'కేంద్రంలో థర్డ్ ఫ్రంట్దే అధికారం'

Feb 3 2014 7:43 PM | Updated on Aug 29 2018 8:56 PM

'కేంద్రంలో థర్డ్ ఫ్రంట్దే అధికారం' - Sakshi

'కేంద్రంలో థర్డ్ ఫ్రంట్దే అధికారం'

వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా బీజేపీలకు పూర్తి మెజార్టీ లభించే అవకాశాల్లేవని సమాజ్వాదీ పార్టీ అధినేత ములయాం సింగ్ యాదవ్ అన్నారు.

గోండా: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా బీజేపీలకు పూర్తి మెజార్టీ లభించే అవకాశాల్లేవని సమాజ్వాదీ పార్టీ అధినేత ములయాం సింగ్ యాదవ్ అన్నారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగించారు.

లోక్సభ ఎన్నికల అనంతరం తమ పార్టీ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తుందని ములయాం ధీమా వ్యక్తం చేశారు. థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఇందులో సమాజ్వాదీ పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంటుందని చెప్పారు. దేశంలోనే ఉత్తరప్రదేశ్లో (80) అత్యధిక ఎంపీ స్థానాలున్నాయని, ఇక్కడ విజయం సాధించకుండా ఏ పార్టీ కూడా కేంద్రంలో అధికారంలోకి రాదని పేర్కొన్నారు. తమ పార్టీ 70 ఎంపీ స్థానాలు గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని ములయాం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement