
పట్టు నిలిచేనా...!
ములాయం పార్టీకి కీలకం కానున్న 12 లోక్‌సభ స్థానాలు
కనీసం ఐదారు గెలిస్తేనే పరువు దక్కేది
ఎలక్షన్ సెల్: లోక్‌సభ ఆరో దశ ఎన్నికల్లో భాగంగా గురువారం పోలింగ్ జరిగే ఉత్తరప్రదేశ్‌లోని 12 సీట్లు పాలకపక్షమైన సవూజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి ఎంతో కీలకమైనవి. యుూపీలోని పశ్చివు, నైరుతి ప్రాంతాల్లోని ఈ స్థానాల్లో ఎస్పీ 2009 ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకుంది. ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా (ఇటావా) ఇక్కడిదే కావడంతో ఈ 12 సీట్లను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ ఎన్నికల్లో కూడా ఎస్పీ ఐదారు సీట్లు గెలుచుకుంటే తప్ప 2009 నాటి స్కోరు (23 సీట్లు) సాధించలేదు. వుులాయుం కోడలు డింపుల్‌తోపాటు వురో ఐదుగురు ప్రవుుఖ నేతలు పోటీచేస్తున్న స్థానాలు వీటిలో ఉన్నారుు.
వీరితోపాటు ఫారూకాబాద్ నుంచి కేంద్ర విదేశాంగవుంత్రి సల్మాన్ ఖుర్షీద్ వురోసారి పోటీలో ఉన్నారు. వుథురలో సిటింగ్ ఎంపీ, ఆరెల్డీ నేత, కేంద్ర వివూనయూన వుంత్రి అజిత్‌సింగ్ కొడుకు జయుంత్ చౌధరీతో బీజేపీ టికెట్‌పై బాలీవుడ్ డ్రీమ్‌గర్ల్ హేమామాలిని తలపడుతున్నారు. ఈ నియోజకవర్గం పక్కనే ఉన్న ఫతేపూర్ సిక్రీ నుంచి ఆరెల్డీ అభ్యర్థిగా వుులాయుం వూజీ సన్నిహితుడు అవుర్‌సింగ్ పోటీ చేస్తున్నారు. ఎటా స్థానంలో బీజేపీ నేత, రాష్ర్ట వూజీ సీఎం కల్యాణ్‌సింగ్ కొడుకు రాజ్వీర్‌సింగ్ బీజీపీ టికెట్‌పై మొదటిసారి లోక్‌సభకు పోటీపడుతున్నారు. వుులాయుం పోటీచేస్తున్న మైన్‌పురీ, సొంత ఊరున్న ఇటావా(ఎస్సీ), కిందటి ఎన్నికల్లో ఆయున కొడుకు అఖిలేశ్ గెలిచిన ఫిరోజాబాద్, కనౌజ్‌లో యూదవ ఓటర్లు గణనీయు సంఖ్యలో ఉండడంతో ఇక్కడ ఎస్పీ సాధించే ఫలితాలు ఆయున ప్రతిష్టకు అద్దంపట్టనున్నాయి.
కిందటి ఎన్నికల్లో ఎవరికెన్ని?
2009లో ఈ 12 సీట్లలో కాంగ్రెస్, ఆరెల్డీలు రెండేసి చొప్పున గెలవగా బీజేపీ, బీఎస్పీ చెరొక స్థానం దక్కించుకున్నారుు. ఎటా స్థానంలో ఎస్పీ వుద్దతుతో పోటీచేసిన కల్యాణ్‌సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మిగిలిన ఐదు సీట్లు ఎస్పీ ఖాతాలో పడ్డాయి. సీఎంగా ప్రవూణం చేశాక భర్త అఖిలేశ్ రాజీనావూ ఫలితంగా కనౌజ్ సీటుకు 2012లో జరిగిన ఉప ఎన్నికలో డింపుల్ పోటీలేకుండా ఎన్నికైన విషయుం తెలిసిందే. ఈసారి ఆమె వుళ్లీ కనౌజ్ నుంచే పోటీచేస్తున్నారు. వుులాయుం ప్రతిష్టకు పరీక్షగా భావించే స్థానాలు-మైన్‌పురీ, ఇటావా, కనౌజ్, ఫిరోజాబాద్, హర్దోరుు. వీటన్నింటినీ నిలుబెట్టుంటేనే పరువు నిలిచే రీతిలో 20కి పైగా సీట్లను వుులాయుం పార్టీ సాధించగలుగుతుంది.
అయితే ఎస్సీలకు రిజర్వ్‌చేసిన హర్దోరుు సీటును ఎస్పీ నిలబెట్టుకోవడం అంత తేలిక కాదని భావిస్తున్నారు. వుుజఫర్‌నగర్ వుతఘర్షణల ఫలితంగా నష్టపోరుున వుుస్లింల ఓట్లు ఎస్పీకి రెండేళ్ల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల స్థారుులో పడితే తప్ప ఇక్కడ ఎస్పీ తన పట్టు నిలబెట్టుకోలేదు. మోడీ గాలి వుులాయుంకు పట్టున్న ఇక్కడ కూడా పనిచేస్తే డింపుల్, వుులాయుం గెలుపుతోనే ఎస్పీ సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎస్పీ అంచనాలు నిజవువ్వాలంటే యూదవ్ బెల్ట్‌గా భావించే మైన్‌పురీ, ఇటావా, కనౌజ్, ఫిరోజాబాద్‌తో పాటు కిందటిసారి గెలిచిన హర్దోరుులో వుళ్లీ గెలిచి, ఎటాను కైవసం చేసుకోవాల్సిన అవసరం ఉంది.