'కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే థర్డ్ ఫ్రంట్ ప్రభుత్వం'
లక్నో: ఎన్నికల అనంతరం ఏర్పడే ప్రభుత్వంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త జోస్యం చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిణితి చెందిందంటూనే.. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ మద్దతునే మూడో కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. బీజేపీకి తగినన్ని స్థానాలు రావని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనతకు చేరుకుంటుందన్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మూడో కూటమి మద్దతునివ్వడం ఖాయమని తెలిపారు. మూడో కూటమిలో పార్టీలకే ప్రస్తుతం అత్యధిక లోక్ సభ సీట్లు వస్తాయని అఖిలేష్ తెలిపారు.
గతంలోని అనుభవాల నేపథ్యంలో మూడో కూటమి నిలబడుతుందా?అన్న ప్రశ్నకు ప్రజాస్వామ్యం ఇప్పుడు చాలా పరిణితి చెందిందన్నారు.ఎన్డీఏ, యూపీఏలు పూర్తి స్థాయి పాలనను అందిచాయని, ఈసారి మాత్రం మూడో కూటమితోనే ప్రభుత్వం ఏర్పడుతుందని పునరుద్ఘాటించారు.