ఢాకా: బంగ్లాదేశ్ తమ జైలులో ఉన్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఉల్ఫా అగ్రనేత అనూప్ చెతియా ను బుధవారం భారత్‌కు అప్పగించింది. సీబీఐ గురువారం అతడిని కస్టడీలోకి తీసుకుని రిమాండ్‌కు పంపించింది. చెతియా(48)ను విదేశీ నగదు, శాటిలైట్ ఫోన్ కలిగివున్నందుకు 1997లో బంగ్లా పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బంగ్లాను రాజకీయ ఆశ్రయం కోరాడు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదాకా కస్టడీలోనే ఉంచాలని కోర్టు పేర్కొంది చెతియా అప్పగింతకు ప్రతిగా.. బెంగాల్ జైల్లో ఉన్న బంగ్లా నేరస్తుడు హుసేన్‌ను భారత్ ఆ దేశానికి అప్పగించనుంది. బంగ్లాలో ఏడుగురిని హత్య కేసులో అతడు నిందితుడు.