ఆర్టీఐ, సోషల్ మీడియాలతో కాంగ్రెస్ గద్దె దించండి: మోడీ | Use right to information act (RTI), social media as campaign tools:Narendra Modi | Sakshi
Sakshi News home page

ఆర్టీఐ, సోషల్ మీడియాలతో కాంగ్రెస్ గద్దె దించండి:మోడీ

Published Thu, Sep 26 2013 11:56 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఆర్టీఐ, సోషల్ మీడియాలతో కాంగ్రెస్ గద్దె దించండి: మోడీ - Sakshi

ఆర్టీఐ, సోషల్ మీడియాలతో కాంగ్రెస్ గద్దె దించండి: మోడీ

కాంగ్రెస్ పాలనలో అటు కేంద్రంలో, ఇటు ఆ పార్టీ అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అవినీతిలో కురుకుపోయాయని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. బుధవారం సాయంత్రం తిరువనంతపురంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులతో మోడీ సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారి ఉద్దేశించి ప్రసంగిస్తూ... తొమ్మిదేళ్ల పాలనలో ఆ పార్టీ అవినీతి భాగోతాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు బీజేపీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.

 

కాంగ్రెస్ పార్టీ అవినీతిని వెలుగులోకి తీసుకువచ్చేందుకు సమాచార హక్కు (ఆర్టీఐ), సామాజిక అనుసంధాన వేదిక (సోషల్ మీడియా)ను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించుకోవాలని వారికి మోడీ సూచించారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఆ రెండు అత్యుత్తమైన ప్రచార సాధనాలని మోడీ అభివర్ణించారు. కుంభకోణాలమయమైన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

 

దేశ ప్రజలకు మిగిలిన ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే అని శ్రేణులకు మోడీ వివరించారు. 2014లో జరగనున్న ఎన్నిల ద్వారా అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి ఇదే సరైన సమయం అని ఆయన వారితో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వి.మురళీధరన్, సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ఒ.రాజగోపాల్, పార్టీ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ తదితరులు ఆ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement