ముంబై: ప్రముఖ మైనింగ్ సంస్థ వేదాంత లిమిటెడ్ ఆకర్షణీయమైన ఫలితాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. నాలుగురెట్ల పెరుగుదలతోమ రూ. 1,866 కోట్లు నికర లాభాలను ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరంలో ఇదే క్వార్టర్ నికరలాభం రూ 412 కోట్లుగా ఉంది. ఆపరేషన్ల నుండి మొత్తం ఆదాయం 30 శాతం పెరిగి రూ. 20,393 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇది రూ. 15,731 కోట్లుగా ఉంది.
నిర్వహణ లాభం(ఇబిటా) 77 శాతం దూసుకెళ్లి రూ. 5879 కోట్లకు చేరగా.. ఇబిటా మార్జిన్లు 21.1 శాతం నుంచి 28.8 శాతానికి బలపడ్డాయి. ఈ కాలంలో పన్ను వ్యయాలు కూడా రూ. 49 కోట్ల నుంచి రూ. 897 కోట్లకు పెరిగాయి.
డిసెంబర్ త్రైమాసికంలో జింక్ ఇండియా మెటల్ ఉత్పత్తి క్వార్టర్ ఆన్ క్వార్టర్ 44 శాతంపెరిగినట్టు తెలిపింది. బాక్సైట్ మరియు కంకర మైనింగ్ ప్రారంభ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి పనిచేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. క్వార్టర్ 3లో కాపర్ ఇండియా ఉత్పత్తి 102 కేటీ గా నమోదైనట్టు వేదాంత తెలిపింది.
వేదాంత లాభం నాలుగు రెట్లు జంప్
Published Tue, Feb 14 2017 3:07 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM
Advertisement
Advertisement