ఇంకా కుదురుకోని ‘సంక్షేమం’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంకా విభజన బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. ముఖ్యం గా ఉన్నతోద్యోగుల విభజన కారణంగా సంక్షేమ శాఖల పనితీరు మందగించింది. రాష్ట్ర విభజన జరి గి పధ్నాలుగు నెలలు దాటినా పరిపాలనాపరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలు పూర్తిస్థాయిలో ఇంకా కుదురుకోలేదు. కీలకమైన పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ సంక్షేమ భవన్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ డెరైక్టరేట్లలో ఉద్యోగుల కొరత కారణంగా పని ఒత్తిడి పెరిగింది. ఎస్సీ అభివృద్ధిశాఖలో ఒక అదనపు డెరైక్టర్ పోస్టు ఏపీకి కేటాయించడంతో తెలంగాణకు విడిగా ఒక స్థానాన్ని సృష్టించాల్సి వస్తోంది.
ఇద్దరు జేడీలు ఉండగా వారిలో ఒకరు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఆ పోస్టును కూడా భర్తీ చేయాల్సి ఉంది. ఇక సాంఘిక సంక్షేమ అధికారుల(ఎస్‌డబ్ల్యూవో) పోస్టులు మొ త్తం 858 ఉండగా వాటిలో 177 ఖాళీగా ఉన్నాయి. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారుల(డీఎస్‌డబ్ల్యూవో) పోస్టులు 11కుగాను 9 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏఎస్‌డబ్ల్యూవో పోస్టులు 61 కాగా అం దులో 8 ఖాళీగా ఉన్నాయి.
మల్టీ జోనల్/జోనల్ పోస్టులు కలుపుకుంటే 150 పోస్టులకుగాను 32 ఖాళీగా ఉన్నాయి. ఎస్టీ శాఖకు సంబంధించి ఏపీకి అడిషనల్ డెరైక్టర్ పోస్టు వెళ్లడంతో ఇక్కడ ఏడీ పోస్టును సృష్టించాల్సి ఉంది. దీనితోపాటు ఒక జేడీ, రెండు డీడీ పోస్టులు, ఆరు సెక్షన్ సూపరింటెండెంట్ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, 10 అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, రెండు జోనల్ అగ్రికల్చర్ ఆఫీసర్, ఏడు ఏటీడబ్ల్యూవో పోస్టులు, 83 గ్రేడ్-2 హెడ్‌మాస్టర్ పోస్టులు, వంటవాళ్లు 201 మంది, 129 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు గ్రేడ్-2 పోస్టులు, 352 సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఏఎస్) పోస్టులు, 259 సెకండరీ గ్రేడ్ టీచర్ల(జీపీఎస్)పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
బీసీ సంక్షేమ శాఖ అదనపు డెరైక్టర్ పోస్టు ఏపీకి కేటాయించడంతో జాయింట్ డెరైక్టర్ ఇన్‌చార్జి డెరైక్టర్‌గా కొనసాగిస్తున్నారు. అదనపు డెరైక్టర్ పోస్టును సృష్టించాల్సిన అవసరం ఏర్పడింది. బీసీ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు 750కుగాను 200 ఖాళీగా ఉన్నాయి. మొత్తం 1500 కామాటీ, వంట వాళ్లు, వాచ్‌మన్ పోస్టులకుగాను 310 ఖాళీగా ఉన్నాయి.